Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల ఆర్ అండ్ బి రహదారి సముదాయం నందు సోమవారం మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా నందలూరుబిజెపి సీనియర్ నాయకులు హిమ గిరినాథ్ యాదవ్. కోడూరు ఆదినారాయణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 46వఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. జెండాను ఎగరేసి మిఠాయిలు పంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సీట్ల నుండి 300 పైచిలు కు పార్లమెంటు, రాజ్య సభ మోడీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అనేక రకాల పథకాలు మంజూరు చేయడం జరిగిందని దేశంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి మోడీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి క్రియాశీలక సభ్యులు హేమంత్ ,అంజన్,కుమార్ ,గోపీనాథ్ ,వంశీ, మల్లి, మల్లికార్జున కూటమి నాయకులు తెలుగు దేశం జిల్లా మైనారిటీ నాయ కులు. సయ్యద్ అమీర్. వెంకటయ్య,రాముయాదవ్ ,జనసేన నాయకులు ఆకుల చలపతి తదితరులు పాల్గొన్నారు.