మాజీ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్
జనం న్యూస్,ఏప్రిల్ 06,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పిఎం దామరగిద్దలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం రోజున స్థానిక శివాజీ చౌక్ లో బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీగా,డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయల ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కాంక్షిస్తూ అత్యుత్తమ పథకాలతో ప్రగతి బాటలో నడుస్తున్న ఏకైక పార్టీ భాజపా అని అన్నారు.ఈ సందర్భంగా మండల ప్రజలకు భాజపా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సుభాన్ రావు పాటిల్,గోపాల్ రావు,కాపార్తి దత్తు సెట్,గుర్రపు నారాయణ,కమ్మరి నరేందర్,ముప్పిడి సాయిలు,పొగాకుల విట్టల్,మాడా రమేష్, దేవి దాస్,దండు సంతోష్,పోశెట్టి వీరేశం, రెడ్డి గోపాల్,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


