

CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్ డిమాండ్.
జనం న్యూస్ 13.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : పత్తి కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నా కి సిపిఎం గా మద్దతు తెలిపి అనంతరం రైతులతో కలిసి అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్ లు మాట్లాడుతూ ఆసిఫాబాద్ లోని మార్కెటింగ్ అధికారులు, ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్ముక్కై పత్తి కొనుగోలు అనేక అంశాలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సాయంకాలం నుండి ఇప్పటి వరకు సర్వర్ డౌన్ ఉందనే పేరుతో పత్తి కొనుగోలు ఆపేసారు. దీనితో కిరాయి వెహికిల్ లలో పత్తి తీసుకువచ్చిన రైతులు చాలాఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమయానికి సమయం, ఆర్థిక నష్టం కూడా జరుగుతుందని అన్నారు. అదేవిధంగా స్థానిక మిల్లులో 1500 క్వింటాళ్ల వరకే పత్తి కొనుగోలు చేస్తుండడంతో మిగిలిన రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఎటువంటి షరతులు లేకుండా జిన్నింగ్ కు వచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పెంటయ్యి, నితిన్, మహదు, గోపాల్, పోచన్న, సాయి కిరణ్, వెంకటేష్, వినోద్, ముస్తఫా, దత్తు తదితరులు పాల్గొన్నారు.
