జనం న్యూస్ ఏప్రిల్ 07:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలం:
అక్రమ ఇసుక రవాణాపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మండల రెవెన్యూ పరిశీలకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు గుమ్మిర్యాల్ గ్రామంలో గస్తీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్యాక్స్ గోదాం పరిసర ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన సుమారు 8 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించారు. అనంతరం గ్రామంలోని బ్రిడ్జి క్రింద వాగు వద్ద తనిఖీలు చేపట్టగా, ఇసుకతో లోడ్ అయిన 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు.సీజ్ చేసిన ఇసుక డంపు మరియు 2 ట్రాక్టర్లను తహసీల్దార్ మల్లయ్య స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూ, మండలంలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిరంతరం గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలపై సమాచారం అందించాలని కోరారు.



