జనం న్యూస్- ఏప్రిల్ 9- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని టీజీ జెన్కో, టీజీ ఎన్ పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ టీజీ జెన్కో కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు ధర్నాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం లేదని, విద్యా అర్హతల ప్రకారం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ వర్క్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు, 2016 ముందు నుంచి పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు, 2026 పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.


