Listen to this article

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి

జనం న్యూస్ 13ఫిబ్రవరి (కొతగూడెం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో మార్చి 8వ తారీకున (శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు. 1.యాక్సిడెంట్ కేసులు ,2.సివిల్ కేసులు ,3.చీటింగ్ కేసులు ,4.చిట్ పన్డ్ కేసులు ,5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు , 6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు,7.చిన్నచిన్న దొంగతనం కేసుల, 8. ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కుటుంబ తగాదాలు ,బ్యాంకు లావాదేవీల కేసులు 11. టెలిఫోన్ బకాయిల కేసులు కొట్టుకున్న కేసులు ,సైబర్ క్రైమ్ కేసులు,చిట్ ఫండ్ కేసులు,ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.