Listen to this article

దగ్ధమైన పూరిల్లు

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 10 :

మండలంలోని ఏన్కూరు చెరువు బజార్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.గ్రామానికి చెందిన లేల వెంకమ్మ సుక్కులు నివాస గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అంటుకుని పూరిల్లు దగ్ధమైంది. సమాచారం ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒక గంట సమయంలో ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఇంటిలో ఉన్న సామాన్లు, గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వారి చొరవతో అగ్ని మరింత వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.