Listen to this article

జుక్కల్ ఫిబ్రవరి 13 జనం న్యూస్ : జాతీయస్థాయి ఈ లైబ్రరీ శిక్షణకు మద్నూర్ ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు రచ్చ శివకాంత్ ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 19 వరకు మైసూర్ లోని ప్రాంతీయ విద్యా కేంద్రం లో నిర్వ హించే ఆరు రోజుల శిక్షణకు హాజరుకానున్నారు. సీసీఎ స్ఎల్ కోర్సు ఆర్ ఐఈ (రీజినల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఎడ్యూకేషన్) మైసూర్ సంస్థ జాతీ యస్థాయిలో శిక్షణ అందిస్తుందని ప్రధానోపాధ్యాయుడు నాంపల్లి మల్లేశం తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఉపాధ్యా యులను ఎంపిక చేయగా వారిలో ఉమ్మడి జిల్లా నుంచి రచ్చ శివకాంత్ ఉండటం విశేషం.