జనం న్యూస్ ఏప్రిల్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో త్రైత శకం కాలసూచికను ఎల్కతుర్తి సి ఐ పులి రమేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్రైత శకం కాలసూచికలో ఆధ్యాత్మిక అంశాలను సమగ్రంగా, సరళమైన భాషలో పొందుపరిచినట్లు తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అందించిన జ్ఞానం ఇందులో విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు.జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను స్పష్టంగా వివరిస్తూ, “యుగాది” అనే పదం “ఉగాది”గా ఎలా మారిందో అర్థసహితంగా వివరించారని స్వామివారిని కొనియాడారు.అలాగే చైత్రమాసం నుండి ఫాల్గుణమాసం వరకు తెలుగు సంప్రదాయ కాలమానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కాలసూచిక రూపొందించ బడినందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సి ఐ కార్యాలయము నందు ఇందు ఙ్ఞాన వేదిక ఎల్కతుర్తి శాఖ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి, సభ్యులు, సతీష్ చారి,రాకేష్,స్రవంతి,రాణి,క్షేత్రగ్న,దివిజ,తనుష, ఋషి, మోక్షజ్ఞ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


