Listen to this article

జనంన్యూస్. 10. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు ఈరోజు కిరాయి మూకలను ఉపయోగించి బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే, వాటికి సమాధానం చెప్పలేక భయపడి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. జిల్లాల రమేష్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం మాత్రమే కాకుండా, ప్రజల హక్కులపై నేరుగా దాడి చేయడం కూడా. ఇలాంటి దాడులు చూస్తూ ఊరుకోము. ఈరోజు రమేష్ పై దాడి చేయడం కచ్చితంగా కుట్రలో భాగమే. పోలీసు వారిని కోరడం ఏమనగా ఈ దాడిలో సరైన నిజాలు బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఎనిమిదవ డివిజన్ బిజెపి కార్పొరేటర్ పై రెండు రోజుల క్రితం కేసు నమోదైన విషయం మరుగున పడకముందే అదే డివిజన్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రమేష్ పై దాడి జరగడం కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా లోతుగా పరిశీలన చేసి ఇలాంటి తప్పుడు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి.విమర్శలను స్వీకరించి సమాధానం ఇవ్వాల్సింది పోయి, దాడులు చేయించడం చాలా బాధాకరం. ఈ విధమైన బెదిరింపులు, దౌర్జన్యాలు ఎంత చేసినా నిజం దాచలేరు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.