Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి రాష్ట్ర మహోత్సవాలు 24వ రోజుకు చేరుకుని అనకాపల్లిలో వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కీ పర్యవేక్షణలో ఉత్సవాలు కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లక్ష్వరం అన్నమయ్య చార్య వాగ్దాయ వరదాయని బృందం ప్రదర్శించిన కోలాటం ప్రేక్షకులను అలరించింది.అనంతరం పులకండ విజయబాబు అందించిన ఈలపాటలు, మైదానంలో ఉత్సాహాన్ని నింపాయి.చివరగా ఉమామహేశ్వర మ్యూజిక్ కూచిపూడి అకాడమీ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.ఈ కార్యక్రమానికి పులకండ విజయబాబు, విల్లూరి హరికృష్ణ, మణి కుమారి, దళపతి భాను, మద్దాల కృష్ణ, శృంగవరపు శ్రీకాళహస్తి, మల్ల బాబు, భారతి, ప్రియాంక తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగ శీను, ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండల సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ లు తిమ్మ పాత్రుని చక్రవర్తి, సకల గోవింద్, మరియు గండేపల్లి మురళి, తదితరులు పాల్గొన్నారు.