జనం న్యూస్: ఏప్రిల్ 10 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
ఉపాధి హామీ కార్మికులకు రెండు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని ఈనెల 21 22 తేదీలలో మండల కేంద్రాలలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య పిలుపునిచ్చారు శుక్ర వార0 రోజున నిడమనూరు మండలం మారుపాక గ్రామంలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించి సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులు పనిచేయడానికి విబిజి కొత్త చట్టం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత చట్టంలో ఉన్నటువంటి సౌకర్యాలు తొలగించింది. పనిచేయడానికి ఐ క్యాప్షన్ వస్తేనే పనికి తీసుకుంటున్నారు లేకుంటే కార్మికులు పనికి దూరమవుతున్నారని తెలిపారు
ప్రదేశాలలో కనీసం త్రాగునీరు కూడా అందించలేదు ఈ కొత్త చట్టం ద్వారా ఉన్న ఉపాధి పని పోయే ప్రమాదం ఉందని అన్నారు వెంటనే దీని రద్దు చేసే అంతవరకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
గత మూడు నెలలుగా పని చేస్తున్న కార్మికులకి ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా ఎంత కూలీ పడుతుందో తెలియకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందుల గురిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా 90% నిధులను 60 శాతానికి కుదించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 40 శాతం నిధులు కేటాయించి ఉండగా ఒక రూపాయి కూడా కేటాయించలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పని పోయే ప్రమాదం ఉందని సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కార్మికుల సమస్యల పైన 20 21 తేదీలలో అన్ని మండల కేంద్రాలలోజరుగు ధర్నాలో కార్మికులు పెద్దఎత్తున పలొగొనాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యాకాస మండల కార్యదర్శి కందుకూరు కోటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసయ్య, మారుపాక గ్రామ ఉపాధి హామీ సంఘం గ్రామ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షులు కోమటి సోమయ్య, కార్యదర్శి కోమటి కవిత, ఉపాధ్యక్షులు పోలబోయిన పద్మ, వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు, కోశాధికారి కోమటి రామయ్య, సంఘం నాయకులు ఇస్లాం వెంకటేశం, చిత్రం చిన్న పెద్దలు, ఆదిమల్ల పూలమ్మ, నక్క గోపయ్య, ఈగల జ్యోతి, చిత్రం సామ్రాజ్యం, నందికొండ పద్మ, తదితరులు పాల్గొన్నారు
.


