Listen to this article

జనం న్యూస్-ఏప్రిల్ 10 – నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో పైలాన్ కాలనీలోని నిర్మల అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన వైద్య శిబిరంలో బస్తీ దవాఖాన డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం పరిధిలోని ప్రజలకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ 14 సంవత్సరంలో నిండి 15 సంవత్సరాలు పూర్తికాని బాలికలు అందరికీ హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కమలమ్మ, హెల్త్ అసిస్టెంట్లు గంగా బాయి, లింగయ్య,తిరుమల చారి,అంగన్వాడీ టీచర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.