జనం న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ బీసీ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు భాశెట్టి నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ ఆంజనేయనగర్ చౌరస్తా లో నిర్వహించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్య అతిధిగా హాజరై ఫూలే చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతు జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వారి హక్కుల కోసం, విద్య, సామాజిక న్యాయం సమానత్వం కోసం చేసిన పోరాటం నేటికి ఆదర్శమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో ఫూలే సిద్ధాంతాలను బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా బిసి రిజర్వేషన్లు అమలు చేస్తు నిజమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, రాష్ట్ర ఓబిసి వైస్ చైర్మన్ తూము వినయ్ కాంగ్రెస్ నాయకులు సప్పిడి భాస్కర్, గోకర్ల లక్ష్మి నారాయణ, బి సి నాయకులు చిలుక ప్రకాష్, నారాయణ, సూర్య నారాయణ తదితరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



