జనం న్యూస్ ఏప్రిల్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మహాత్మ జ్యోతిరావు పూలే 200 వ జయంతి వేడుకలు ఏప్రిల్ 11వ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, పూలే మొదట్లో పూల వ్యాపారం చేసే వారిని ఆ పేరుతోనే ఇంటి పేరుని మార్చుకొని జ్యోతిరావు పూలే అని సమాజానికి పరిచయం చేశారని, భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం, కులై పోరాడిన తొలితరం నాయకుల్లో పూలే ఒకరిని, సమాజంలో అణగారి వర్గాల కోసం ఆయన చేసిన కృషిని 1888లో ఆయనకు మహాత్మా అనే బిరుదు లభించిందని, మహిళలకు విద్య అందితేనే సామాజిక మార్పు సాధ్యమని 1848లో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారని, పూలే ఆశయ సాధన కోసం నేటి యువత సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. ఈరోజు ఉదయం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ కోట్ని రామకృష్ణ కుప్పిలి జగన్ మల్ల గణేష్v.. డివీపీ అప్పారావు విల్లూరి రమణబాబు సాలాపు నాయుడు బుద్ధ విశ్వనాథం పెంటకోట వరప్రసాద్ పొలిమేర నాయుడు దాడి వేణు సారిపల్లి శ్రీనివాసరావు బొడ్డేడ అయ్యప్ప శ్రీకాకుళం గణపతి కాండ్రేగుల వెంకట సూరి తదితరులు పాల్గొన్నారు


