Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 11-04-26

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల అరవపల్లె ఆర్. అండ్.బి సముదాయం దగ్గర శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తాటి సుబ్బరాయుడు. ఆధ్వ ర్యంలో జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గంటా గోపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిం చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కులకై పోరాడి అందరికీ అండగా నిలిచిన పోరాట యోధుడు విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఆదిశగా గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వారు తెలిపారు. ఈ కార్య క్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, కార్యదర్శి గొబ్బిళ్ళ సుబ్బరాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేవూరు వేణు గోపాల్. మాజీ సర్పంచులు జంబు సూర్యనారాయణ, మోడపోతుల రాము, నారపు శెట్టి శివ, గంధం గంగాధర్, పాటూరు రమేష్, సిరిసాల నాగేంద్ర, టిడిపి జిల్లా మైనారిటీ నాయకుడు సయ్యద్ అమీర్, మహబూబ్ బాషా, చామంచి పెంచలయ్య, కానకుర్తి వెంకటయ్య, సురేష్, వేణు, రాజా, మున్వర్ భాష, తదితరులు పాల్గొన్నారు.