సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 11. 04. 2026-
11-04-2026 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో వై.నరోత్తం గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళాసాదికారతకు నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారని అజ్ఞానపు చీకట్లను తొలిగించి జ్ఞాన జ్యోతిని వెలిగించిన మహానియుడు దళితుల మరియు మహిళల హక్కు కోసం వారు చేసిన కృషి యుగయుగాల వరకు గుర్తుండి పోతుంది అని అన్నారు,జహీరాబాద్ పట్టణంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి కోరుతున్న ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం సరైంది కాదు అలాంటి మహానియుల విగ్రాహాల ఏర్పాటు ఎంతో అవసరం బావితరాలకు వారు ఆఫ
దర్శ ప్రాయులు కావున ప్రభుత్వం వెంటనే జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,నాయకులు శివకుమార్,యస్.గోపాల్,జి.మల్లేశం,చెంగల్ జైపాల్, పెంటన్న,ప్రేమ్ కుమార్,విరా స్వామి,గఫార్,పవన్ రాథోడ్, మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు


