Listen to this article

జనం న్యూస్ 11 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు.మల్దకల్: మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం గ్రామ శివారులోని దాదాపు 10 మూగ జీవాలు చిరుతపులి దాడిలో మృతి చెందాయని దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని,వెంటనే గ్రామస్తులకు రక్షణ కల్పించాలని నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు తిమ్మప్ప మరియు తిమ్మప్ప నాయక్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు ఏప్రిల్ 9న నేతివానిపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు చిరుత పులి సంచరిస్తున్న ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చగా లేగ దూడపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయని,మళ్ళీ ఏప్రిల్ 10 న రాత్రి 10గంటల సమయంలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిందని దీంతో ఒక గొర్రె చిరుత దాడిలో మృతి చెందిందని,దీంతో చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని తెలిపారు అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి చిరుతపులిని బోనులో బంధించి, ఆయా గ్రామ ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు చిరుత దాడిలో మృతి చెందిన జీవాలకు ప్రభుత్వం పరంగా నష్ట పరిహారాన్ని రైతులకు అందించాలని కోరారు.ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అటవీశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.