Listen to this article

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

జనం న్యూస్: ఏప్రిల్ 11 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్

రైతు కూలీల హక్కుల కోసం శ్రమతోపేడికి గురవుతున్న పేదలను సంఘటిత పరిచేందుకు 1873లోనే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను జ్యోతి రావు పూలే స్థాపించాడని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలియజేశారు శనివారం రోజున నిడమనూరు మండలంలోని వెంకటాపురం నిడమనూరు మండల కేంద్రాల్లో జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాలను ఉపాధి పనుల వద్ద కూలీలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అణగారిన వర్గాలు శ్రమ దోపిడీకి గురవుతున్న నేపథ్యంలో వారికి చదువు నేర్పడంతో పాటు శ్రమకు తగిన వేతనాల కోసం ఉద్యమాలు నిర్వహించాడని ఆయన స్ఫూర్తితో కార్మికులంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు
అసైన్మెంట్ భూములపై భూ కమిషన్ ఏర్పాటు చేయాలనీ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచిన భూములు కబ్జా కాకుండా చట్టాలు ఉన్నప్పటికీ, అమలు పూర్తిగా విఫల మైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసినట్లు ప్రకటించినా, అందులో భారీగ అన్యాక్రాంతం అయిందని తెలియజేశారు
1/77 చట్టం ఉన్నప్పటికీ కబ్జాలు విస్తృతంగా జరిగాయి. అత్యధిక భూములు ధనవంతులు, రియల్ ఎస్టేట్ వర్గాల చేతుల్లో ఉన్నాయి. వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవు. ప్రభుత్వాలే ఇప్పుడు చట్టాలను సవరించి, “ప్రస్తుతం ఉన్నవారికే హక్కులు” అంటూ పేదల భూములను ధనవంతులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నరనీ అసైన్మెంట్ భూములపై భూ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి.అన్యాక్రాంత భూములను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకే ఇవ్వాలని . గ్రామసభల్లో భూముల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు .కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను* మాట్లాడుతూ ఉపాధి హామీపై దాడి నీ మానుకొని ఉపాధి కూలీల రెండు నెలల – వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని దేశంలో 15 కోట్లకు పైగా కార్మికులు ఉపాధి హామీపై ఆధారపడి జీవిస్తున్నారని గత 3–4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, 10వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం అత్యంత దారుణం.బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంపై కక్ష కట్టి సంవత్సరానికి 60 రోజుల పనులపై నిషేధం.రోజుకు 2 పూటల హాజరు పని ప్రదేశాల నుంచి ఫోటోలు అప్లోడ్ చేయడం తప్పనిసరని నిర్ణయించడం కూలీలకు అన్యాయం చేయడమే తప్ప మరొకటి కాదని ఇది ఉపాధి హామీ కాదు — ఇది కార్మికులపై నిఘా, వేధింపు.హక్కును భిక్షగా మార్చే దుర్మార్గం.రెండు పూటలా హాజరు, పని ప్రదేశాల్లో మాత్రమే ఫొటోస్ తీసి ప్రభుత్య అప్ కు అప్ లోడ్ చేయాలి అనే వాటిని రద్దు చేయాలని వెంటనే వేతన బకాయిలు విడుదల చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుతో ఉన్న.పాత చట్టాన్ని పునరుద్ధరించాలని ఈనెల 20 21 22 తేదీలలో మండలకార్యాలయాల ముందు మే 15న జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నిడమనూరు మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ఉపాధి కూలీల సంఘం వెంకటాపురం గ్రామ అధ్యక్షులు చిత్రం చంద్రయ్య కార్యదర్శి చిట్టి మల్ల జ్యోతి ఉపాధ్యక్షులు భారీ మహేశ్వరి సహాయ కార్యదర్శి చిట్టిమల్ల సరిత గ్రామ కార్మిక సంఘ నాయకులు చిట్టి మల్ల నరేందర్ చిత్రం శేఖర్ బొంతల నాగమ్మ ఉప్పు ఈశ్వరయ్య సింగం రాములు కొంచెం ఎల్లయ్య నిడమనూరు మండల కేంద్రంలోని మూడో నెంబర్ కాల్వ తండా సంఘ నాయకులు రమావత్ హరిబాబు జటావత్ కృష్ణ నాయక్. కొమ్ము విజయ నేనెవతు శాంతి తదితరులు పాల్గొన్నారు.