Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగితాయి అని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం తెలిపారు. శనివారం ఉదయం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఫోనుగుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలా పోస్టర్ల ను పాలూరి సత్యనందం ముఖ్య అతిధి గా పాల్గొని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ,యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి, ఇళ్ల పల్లంశెట్టి,సబ్బవరపు సత్యనారాయణ,బిజెపి యువమోర్చ మండల అధ్యక్షుడు వలపుశెట్టి కిరణ్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.