

జమ్మికుంట పట్టణ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్..
జనం న్యూస్ //ఫిబ్రవరి //14//జమ్మికుంట //కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా జక్కిడి శివ చరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండలం పక్షాన గాంధీభవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి యువకులంతా పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో పార్టీ మరింత పటిష్టం చేయడం కోసం, పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరవేసే విధంగా యువజన కాంగ్రెస్ ముందుంటుందని అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కులగూడెం చౌరస్తా నుండి యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. ముఖ్య అతిథులుగా , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీణవంక మండల అధ్యక్షుడు, ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మరియు ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు, పెద్ది కుమార్. పాల్గొన్నారు. అదే విదంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమ కారులు అన్నం ప్రవీణ్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శులు రవి, అజయ్, వెంకటేష్, యువజన నాయకులు జావిద్, శివ, సతీష్, సల్మాన్, రాకేష్, అస్రఫ్, సురేష్, పవన్, రాజు, రవి, రాజేష్, ఆదర్శ్, ఆనంద్ తదితరులు ఉన్నారు.