Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 13 జనం న్యూస్

రేపు జరగనున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించాలని సూచించారు. ప్రతి మండలంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణం దిశగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.