Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఎగ్ కార్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సుమారు 50 వేల రూపాయలు విలువైన సంచార బండ్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. గుడ్లు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం పోషకాహార అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 260 ఎగ్ కార్ట్ లను జిల్లాకు పది మందికి చొప్పున డ్వాక్రా మహిళలకు అందజేస్తోంది. కాగా ఈ పథకం కింద పట్టణంలోని జీవీఎంసీ 82 వ డివిజన్ కు చెందిన డ్వాక్రా మహిళ సంతోషి కుమారి ఎంపికయింది. కాగా ప్రభుత్వ సాయంతో ఆమె సోమవారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఈ కార్ట్ ను ఏర్పాటు చేశారు.
ఎగ్ కార్ట్ ప్రారంభోత్సవం చేసిన సురేంద్ర..పట్టణంలోని మండల తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా సోమవారం డ్వాక్రా మహిళ సంతోషి కుమార్ ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్ దుకాణాన్ని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వారిని బలోపేతం చేసేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. కాగా ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రభుత్వం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 50,000 విలువైన ఎగ్ కార్ట్ లను ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ బండ్లతోపాటు గ్యాస్ స్టవ్, వంట సామాగ్రి, కస్టమర్లు కోసం బెంచీలు కూడా సమకూరుస్తోందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ అందిస్తున్న ఈ ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆళ్ల రామచంద్రరావు, 84వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ మాదంశెట్టి నీల బాబు, 80 వ డివిజన్ టిడిపి ఇంచార్జ్ బొడ్డేడ జోగినాయుడు, 82వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ పోలారపు త్రినాథ్, 83వ డివిజన్ జనసేన ఇన్చార్జ్ మంగా ఈశ్వర్, 84 వ డివిజన్ జనసేన ఇన్చార్జ్ చేబోలు దుర్గాప్రసాద్ జీవీఎంసీ అధికారులు ఏపిడి సంతోష్ కుమార్ డి ఆర్ పి ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. కాగా అనకాపల్లిలో ఎగ్ కార్ట్ మంజూరుకు కృషిచేసి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ కృషి పట్ల కూటమి నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు