జనం న్యూస్ 14 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు గద్వాల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ.అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని మరువలేనిదని పేర్కొన్నారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు, అక్కల రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ ఎక్బోటే,రెడ్డి, శ్యామ్ రావ్, పట్టణ అధ్యక్షురాలు రజక నరసింహ, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు సమత, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు దాస్ బిజెపి సీనియర్ నాయకులు సంఘాల అయ్యపు రెడ్డి కౌన్సిలర్లు కుమ్మరి శ్రీను,శాలన్న,చంద్ర శేఖర్,బిజెపి నాయకులు అనిల్ ఢిల్లీ వాలా కృష్ణ, అమర్నాథ్,అశోక్ రెడ్డి తిమ్మన్న,మోహన్ ,భారతి హరి, హరికృష్ణ,సద్దల కృష్ణ,గుండప్ప , తదితరులు ఉన్నారు.


