జనం న్యూస్, ఏప్రిల్ 14,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం కొక్కిరాపల్లి డాక్టర్ బిఆర్ గురుకుల బాలికలు పాఠశాలలో
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జెసి,ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డైరెక్టర్లు,కూటమి నాయకులు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి, సంఘ సంస్కర్త.. ఎంతోమంది హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.ఎన్నో దేశాలు నేటికీ భారత రాజ్యాంగాన్ని చూసి తమ రాజ్యాంగాలను సరిదిద్దుకుంటున్నట్టు చెప్పారు. అపారమైన మేధస్సుతో ఉన్నత విద్యను అభ్యసించిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా, అంటరానితనం నిర్మూలనకు సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచర్స్,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు



