

జనం న్యూస్ పిబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్ జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థలను సోషల్ టీచర్ శ్రీనివాస్ చితకబాదారు. దీంతో విద్యార్థుల చేతులకు, తొడలపై తీవ్రగాయాలయ్యాయి. ప్రతిరోజు మద్యం తాగి పాఠశాలకు వచ్చి తమ పిల్లలను విచక్షణ రహితంగా కొడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంఈఓ హనుమంతును వివరణ కోరగా సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.