Listen to this article

బిచ్కుంద ఎస్సై రాజు

బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్

రాజనీతి జ్ఞాడు, న్యాయ కోవిదుడు భారత రాజ్యాంగ నిర్మాత,సమానత్వానికి ప్రతిక అయిన మహానేత డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ అని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు అన్నారు. మంగళవారం బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామంలో డాక్టర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవా వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఎస్సే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అమూల్యం అని సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతీయులందరికీ స్పూర్తి దయాకమని అన్నారు. బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడుచుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చెయ్యడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. చరిత్రను మర్చిపోయిన వారు చరిత్ర ను సృష్టించలేరని చాటి చెప్పిన జ్ఞాన శిఖరం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటి అధ్యక్షుడు బండకడి పరశురాం, గ్రామ ఉప సర్పంచ్ బండాకాడి సాయిలు లు కొనియాడారు. బాబాసాహెబ్ అందించిన చదువుకో, సంఘటించు, పోరాడు అనే నినాదాన్ని స్పూర్తిగా తీసుకొని విద్యార్థుల హక్కుల కోసం మన మందరం పునరంకితం కావాలని సమానత్వమే లక్ష్యంగా ఆయన చూపిన బాటలోనే నడుస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కె. మోహన్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ఉప అధ్యక్షుడు ఎం. బాగాయ్యా తదితరులు పాల్గొన్నారు.