Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955

పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్జమూడి ప్రసాద్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరూ వాడని,స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త రాజకీయ నాయకుడు ఈ దేశం తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ అన్నారు.మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ గుర్రం జాషువా మీటింగ్ హాల్ నందు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల (ఐఏఎస్))అధ్యక్షతన జరిగిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం,దళితులు అట్టడుగు వర్గాల హక్కుల కోసం,వారి అభ్యున్నత కోసం, సామాజిక సమానత్వం, మహిళల సాధికారత కోసం జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మొదటగా గడియార స్తంభం సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ కృత్తికా శుక్ల, అధికారులు ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడి నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్లోని గుర్రం జాషువా మీటింగ్ హాల్ నందు ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి అయినటువంటి. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందు బాబు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల బిక్షం కలెక్టర్ కృత్తికా శుక్లతో కలసి జ్యోతి ప్రజ్వలన తెలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలను వారు కొనియాడారు. పల్నాడు జిల్లా డివిఎంసి సభ్యులు,దళిత ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు పలు సమస్యలను కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు.కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిడి, ప్రభుత్వ అధికారులు, మహిళలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.