Listen to this article

జనం న్యూస్ -ఏప్రిల్ 14- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్(ఎఇ/77) లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ బడుగు మానస సుమన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ జి రవి, ఉపాధ్యక్షులు అలుపురి శ్రీనివాస్, సెక్రటరీ పిల్లి శ్రీనివాస్, ట్రెజరర్ ఏ రాజా లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు బోరుగడ్డ నాగార్జున, కోరే ప్రేమ్ చంద్, కోటేశ్వరరావు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.