Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ముమ్మిడివరం టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు సన్నిధిరాజు వీరభద్ర శర్మ నాయకత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, భారత రాజ్యాంగ నిర్మాతగా డా. అంబేద్కర్ గారి అపారమైన సేవలను, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డా. అంబేద్కర్ గారి ఆలోచనలు మరియు సిద్ధాంతాలు సమానత్వం, సామాజిక న్యాయం, మరియు సమగ్ర అభివృద్ధి వైపు దేశాన్ని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువెళ్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా సభ్యులు, యువ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.డా. అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని టౌన్ సభ్యులు పునరుద్ఘాటించారు.అనంతరం వేసవికాలం దృష్ట్యా ముమ్మిడివరం టౌన్ క్రియాశీల సభ్యురాలు మరియు టౌన్ అధ్యక్షులు వీరభద్ర శర్మ మాతృమూర్తి అయినటువంటి సన్నిధిరాజు అన్నపూర్ణ వారి ఆర్థిక సహాయంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది.