జనం న్యూస్, ఏప్రిల్ 14, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి
పట్టణంలో ఈ రోజు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని 15వ వార్డులో చావిడి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ 15వ వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష- రాకేష్, కౌన్సిలర్లు ధర్మపురి స్వరూప-వేణు, అరిసె వనజ-మురళి, బత్తుల నరేష్, గుడికందుల అజయ్, లింగంపల్లి సంజీవ్ పాల్గొన్నారు. అనంతరం అరిగెల రాకేష్ మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు అని, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.అంబేద్కర్ గారి ” నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు.” అనే సిద్ధాంతాన్ని స్పూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని, కౌన్సిలర్ గా విజయం సాధించిన తరువాత దానికి అనుగుణంగానే ప్రజాసేవతో ముందుకు వెళుతున్నానని తెలియజేశారు.అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా 4 పేద కుటుంబాలకు నెలకు సరిపడా కిరాణా సరుకులు పంపిణీ చేసి వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.


