జనం న్యూస్ ఏప్రిల్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
(కాట్రేనికోన)
ప్రపంచం గర్వించ దగ్గ నేత అంబేడ్కర్ అని ముమ్మిడివరం సీఐ ఎమ్ మోహన్ కుమార్ పేర్కొన్నారు,కాట్రేనికోన మండల పరిధిలో గొరగనముడి, కాట్రేనికోన,కందికుప్ప, బొజ్జావారిపేట,గరువుపేట,పవరుపేట, సత్తార్ పేట తదితర గ్రామాలలో ఆయా గ్రామాల కమిటీలు నిర్వహించిన 135 వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్ఐ. అవినాష్ లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదే విధంగా పోలీస్ స్టేషన్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు,ఈ సందర్భంగా బొజ్జవారిపేట, గరువుపేట గ్రామాలలో అంబేద్కర్ విగ్రహ కమిటీ వారు ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమిటి సభ్యులు సమక్షంలో ప్రారంభించారు, ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల కమిటి సభ్యులు, అబిమానులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



