Listen to this article

జనం న్యూస్: ఏప్రిల్ 14 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్

రోడ్డు భద్రత వారోత్సవాల లో బాగంగా సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడం మరియు ప్రాణాలతో ఉండడం కార్యక్రమాన్ని ఉప్పునూతల సురేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిడమనూర్ తుమ్మడం గ్రామం లో నిర్వహించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలుతెలుపుతూ
హెల్మెట్ మరియు సీటుబెల్ట్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కార్లలో సీటుబెల్ట్ వాడటం.మద్యం సేవించి డ్రైవింగ్: మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం.
నిర్లక్ష్యపు డ్రైవింగ్: రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి తప్పులను నివారించడం.సురక్షిత ప్రయాణం: ప్రతి ప్రయాణం క్షేమంగా ముగియాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.”అరైవ్ అలైవ్” అంటే కేవలం వేగంగా వెళ్లడం కాదు, “సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడం” అని ఈ కార్యక్రమం యొక్క ప్రధాన సందేశం.అని తెలియజేశారు.మరియు అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బైక్ రైడర్స్ తప్పకుండా హెల్మెట్ దరించాలని, లైసెన్సు లేకుండా వెహికల్స్ నడపవద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. సభకి వచ్చిన వారితో రోడ్ సేఫ్టీ గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.