Listen to this article

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.

ఈరోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, మరియొక అతిధి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తదుపరి కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత మహా మేధావి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన జాతిరత్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుడని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి ఆశయాలు బాటలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ నిర్మాణంలోని అంబేద్కర్ ఆశయాల సాధన ఉంది, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తనకు ఆదర్శం అని చాటి చెప్పారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ ప్రభోదం అంబేద్కర్ స్ఫూర్తి నుండి వచ్చిందే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ప్రకటించారు పార్లమెంట్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించారు, కె.ఆర్ నారాయణ ను రాష్ట్రపతిగా జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్గా నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు.మరియొక అతిధి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం కోసం అంకితభావంతో కృషి చేస్తుందని, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు సక్రమముగా సబ్ ప్లాన్ నిధులు వినియోగం దళిత కాలనీలో మౌలిక సౌకర్యాల కల్పన సంక్షేమ హాస్టల్ల ఏర్పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక చర్యల ను తెలుగుదేశం పార్టీ చేపట్టిందని అన్నారు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళుతుందని, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు అంబేద్కర్ ఆశయ సాధన మన లక్ష్యం కావాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండటమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళులని బుచ్చిబాబు అన్నారు . అలాగే ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టున ఉన్న అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, తాడి నరసింహారావు, గొలకోటి దొరబాబు, దొమ్మేటి రమణ కుమార్,అర్ధాన్ని శ్రీనివాసరావు, కట్టా సత్తిబాబు, పొద్దోకు నారాయణరావు, సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్ల రాజేష్, సబ్బతి పనేశ్వర్ రావ్, ఓగూరి భాగ్యశ్రీ, ములపర్తి బాలకృష్ణ, పిల్లి నాగరాజు,యాళ్ల ఉదయ్,మెండి కమల, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, నడింపల్లి శ్రీనివాసరాజు, సరిపెల్ల శ్రీనివాస్ రాజు, నీతిపూడి వంశి, కాశీ లాజర్, మిమ్మితి చిరంజీవి, యోగేశ్వరి, బొంతు శ్రీరాములు, తాడి జానకిరామ్,కాకి మాణిక్యం నిమ్మకాయల విష్, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, హాస్పిటల్ కమిటీ శ్రీను, కుంచె శ్రీను సానబోయిన సోమయ్య, గడ్డం శ్రీనివాసరావు, జాగు సత్తిబాబు, పితాని నరసింహామూర్తి, కటికదళ నాని, కాశి రామచంద్ర రావు, మొదలగువారు పాల్గొన్నారు.