జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న 8 అంగన్వాడి కేంద్రాలతో పాటు రాయకూర్ క్యాంప్ అంగన్వాడీ కేంద్రానికి బిఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ మంగళవారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కుక్కర్లను పంపిణీ చేశారు. కొత్తపల్లి రవి కిరణ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను తెలుసుకొని అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం సరఫరా చేసిన కుక్కర్లు పాడవడంతో అంగన్వాడీ టీచర్లు కొత్తపల్లి రవికిరణ్ ను సంప్రదించగా వెంటనే స్పందించిన రవికిరణ్ అంగన్వాడి కేంద్రాలకు కుక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు కొత్తపల్లి రవికిరణ్ ను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బిఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రవి కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశానికి ఎనలేని సేవలు అందించి బడుగు బలహీన వర్గాల పేద వర్గాల అందరికీ కూడా సమ న్యాయం కల్పించేలా రాజ్యాంగ సవరణలో ఎన్నో పొందుపరిచారన్నారు. ఈరోజు ఆయన మన ముందు లేకపోయినా మన గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో డౌర్ సాయిలు, కన్నె ప్రవీణ్,సిరిగాది శేఖర్, నరేందర్, సాయిలు, కిజార్ తదితరులు పాల్గొన్నారు.


