

భారీగా తరలివచ్చిన జనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట గ్రామపంచాయతీ లో ఎదిరగుట్ట ల వద్ద శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర మూడు రోజుల పాటు రంగా రంగా వైభావంగా జరుగుతుంది జాతర కు వెంకటాపురం,చర్ల మండలం, సతీస్గడ్ నుండి కూడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ భద్రా చలం నియోజకవర్గం ఎం ఎల్ ఎ డాక్టర్ తెల్లం వెంకట్రావు, అనుచరులు చర్ల మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,మరియు భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జి బి ఆర్ ఎస్ పార్టీ రేగాకాంతారావు, అను చరులు, చర్ల మండలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయ లతో చీర సారాలతో,వనదేవతలను శ్రీ సమ్మక్క సారాలమ్మ దర్శించుకొని గిరిజన సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వయించారు ఈ రోజు గోదావరి వడ్డు నున్న అబ్బారాసి గుహల నుండి గుడి ధర్మకర్త సమ్మయ్య ఆధ్వర్యంలో గిరిజన పూజారులతో సంప్రదాయ ప్రకారం పూజలు జరిపింసి పెద్ద దేవరని కుంకుమ భరణి రూపంలో గుళ్ళోకి తీసుకొస్తారు అనంతరం భక్తులు సాయంత్రం వేళలలో పసుపు కుంకుమ కొబ్బరికాయలు చీర సారాలతోపూజలు జరుపు కోని యాటపోతులను కొడుపుంజులను అమ్మవార్లకు మొక్కుకొని బలి ఇస్తారు అనంతరం కుటుంబ సమేతంగా భోజనాలు చేసి మరుసటి రోజు అమ్మవార్లని దర్శనం చేసుకొని మంగళ హారతులు పట్టి భక్తులందరు తిరుగు ప్రయాణం చీస్త్తారు