Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 15:

జహీరాబాద్ పట్టణం శివశక్తి మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్రీవాణి నియమితులయ్యారు. జహీరాబాద్ పట్టణం లోని సిద్దేశ్వర మందిరం లో బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ మహమండలేశ్వర్ డాక్టర్ శ్రీ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సమక్షంలో నియామకం చేపట్టారు. ఉపాధ్యక్షురాలుగా లక్ష్మీ, ప్రధాన కార్యదర్శిగా స్వాతి, కోశాధికారిగా సూదాం సరస్వతి, సలహాదారులుగా నందిని, నాగజ్యోతి కార్యదర్శులుగా రేణుక, పార్వతీ,విజయమ్మ, స్వర్ణలత,సరస్వతిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త ఎంపీ శ్యామ్ రావు, జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్, పట్టణ శివశక్తి ఉపాధ్యక్షులు సూదాం వెంకట్ ల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్నికైన కార్యవర్గానికి డాక్టర్ శ్రీ మహా మండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సిద్దేశ్వర్, సలహాదారు జైపాల్, కార్యదర్శులు నర్సింలు ప్రభాకర్ రెడ్డి, కౌలాస్ రాజకుమార్, శ్రీనివాస్ రెడ్డి, గోరకఖ్ నాథ్ రావుతో పాటు కాలనీవాసులు,భక్తులు పాల్గొన్నారు