Listen to this article

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హిల్ కాలనీలో బడిబాట కార్యక్రమం

జనం న్యూస్- ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని పీఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెదవుర మండల విద్యాధికారి తరి రాము ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం లో భాగంగా 16వ తారీకు గురువారం రోజున బడిబాట కార్యక్రమాన్ని ముందస్తుగా నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గడపగడపకు తిరిగి బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ హిల్ కాలనీలోని పీఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంజూరైన డిజిటల్ క్లాస్ రూమ్ మరియు అదనపు తరగతి గదులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మరియు టై ,బెల్ట్, షూ, ఐడి కార్డ్స్ రెండు జతల యూనిఫామ్ లు, యోగా డ్రెస్ విద్యార్థులకు అవసరమైన పెన్సిల్స్, ఎరేజర్స్ వంటి వాటిని ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం తో పాటు రాగిజావను కూడా అందించే కార్యక్రమం త్వరలో ప్రభుత్వ సూచనల మేరకు బ్రేక్ ఫాస్ట్ ను కూడా అందించే కార్యక్రమం ప్రణాళికా దశలో ఉన్నదని ప్రభుత్వం వారు ఆమోదిస్తే బ్రేక్ ఫాస్ట్ ను పాఠశాలలో ఏర్పాటు చేసే విధంగా వచ్చే విద్యా సంవత్సరంలో అమలు జరిగే విధంగా చూస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులకు రాగిజావ వారానికి మూడు గుడ్లు ప్రస్తుతం అందించడం జరుగుతుందని, పాఠశాలలో నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు డిజిటల్ కంప్యూటర్ క్లాసులు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతున్నాయని, క్రీడలపై మక్కువ ఉన్న విద్యార్థులకు ఫుట్బాల్, క్రికెట్, యోగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రత్యేకంగా ఒక యోగ టీచర్ ని కూడా ఈ సంవత్సరం నుంచి నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు యోగ మ్యాచ్, యోగా డ్రెస్ లు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరుగుతుందని బాల, బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ వసతి కల్పించబడ్డాయని, విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని మండల విద్యాధికారి తరి రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శేషు , ప్రధానోపాధ్యాయులు రామరాజు, వెంకటరమణ, ఉపాధ్యాయులు సతీష్ కుమార్, వెంకన్న, నరసింహారావు, ప్రసాద్ రావు, రేణుక, సంధ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమణి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.