Listen to this article

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

విద్యార్థులు తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకునేందుకు మహనీయుల జీవిత చరిత్రలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ఎస్సీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ఇటీవల వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. “బాబా సాహెబ్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల ప్రభావం మారిన బడుగు వర్గాల బతుకు చిత్రం” అనే అంశంపై పోటీలు నిర్వహించగా జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, పలువురు వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు. జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.