Listen to this article

జరం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం

కాట్రేనికోన : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనను 16వ తేదీ నుండి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ నమోదు) వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని కాట్రేనికోన తహశీల్దార్ రవికరణ్ తెలిపారు. వెబ్సైట్లో స్వీయ నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నమోదు అనంతరం ఐడి నెంబర్లను తమ పరిధిలోని ఎన్యుమరేటర్కు విధిగా అందజేయవలసి ఉంటుం దన్నారు. స్వీయ నమోదులు పరిశీలన అనంతరం కరెక్ట్ గా ఉంటే సంబంధిత ఏన్యూమరేటరు ఆమోదిస్తారని తహసీల్దార్ అన్నారు. స్వీయ నమోదు సెల్ఫ్ ఏన్యుమరేషన్ విషయమై 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు కార్యచరణను ప్రభుత్వ సర్క్యులర్ ద్వారా 10 నుండి 20 నమోదులు చేయవలసిందిగా షెడ్యూల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. జనగణన స్వీయ నమోదు చేసుకోలేని వారికి ఎన్యుమ ంటర్స్ ప్రతి ఇంటికి వచ్చి నమోదు చేస్తారని తహశీల్దార్ తెలిపారు