Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయినాపురం గ్రామంలో రైతులకు మరింత భరోసా – పి ఏ సి ఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా భావిస్తూ కనీస మద్దతు ధర ( ఎం ఎస్ పి )ప్రకారం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా, తమ పంటను నేరుగా ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా ఈ (పి ఎ సి ఎస్ ) కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.ఇకపై రైతులు తమ ధాన్యాన్ని సరైన ధరకు, పారదర్శకంగా అమ్ముకునే అవకాశాన్ని ఈ కేంద్రం కల్పిస్తుందని, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా, స్వేచ్ఛగా తమ పంటను ఈ కేంద్రాల ద్వారా విక్రయించవచ్చని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యుందుకూరి పాండురంగరాజు మట్ట తులసీ రావు ఈ ఏడుకొండలు ముమ్మిడివరం మార్కెట్ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ మాజీ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు, చిక్కాల బాబులు, చిక్కాల అంజిబాబు కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు, గ్రామ ప్రజలు మరియు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది.