చట్టం బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ‘ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) మండల స్థాయి కార్యక్రమం గురువారం నాడు మున్సిపల్ చైర్మన్ సీమ షట్కర్ అధ్యక్షతన జరిగిన . ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ తాసిల్దార్ వేణుగోపాల్ డెలికేట్ విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గోపాల్ రెడ్డి పటేల్ ఎంపీడీ మున్సిపల్ , వార్డు కౌన్సిలర్లు, నౌషా నాయక్ మారుతి బిచ్కుంద మండల కేంద్రంలోని సర్పంచులు మరియు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరు గ్యారంటీ’ పథకాలు మండలంలో సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 23 గ్రామపంచాయతీ లో 557ఇల్లు మంజూరు కావడంతో అందులో 43 ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్నారు మిగతావారు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పారు.నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.23 గ్రామపంచాయతీలో చేయూత పింఛన్ల ద్వారా సుమారు 4880 మంది పింఛన్లు అందిస్తూ వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నామని వివరించారు. మహాలక్ష్మి, గృహ జ్యోతి, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని చెప్పారు.ఇటీవల నిర్వహించిన వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఎంపీడీవో కృష్ణ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మండల ప్రజలు పాల్గొన్నారు.




