Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955

షిరిడీ నుంచి సాయి వస్త్రములు పంపించిన మద్ది రమేష్ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకొని శ్రీ దత్త సాయికి ప్రత్యేక అభిషేక అర్చనా పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగా వేదమంత్రాలతో ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం అనంతరం గులాబీ పూలతో సహస్రనామ పారాయణ పూజా కార్యక్రమం జరిగింది, అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, నెలలు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కి ప్రత్యేక హారతులు సమర్పించారు, అనంతరం ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమానికి, పావులూరు వంశీకృష్ణ, ధర్మపత్ని ప్రశాంతి, లు 25 కేజీలు బియ్యం సమర్పించినారని దత్త సాయి సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు, సద్గురు సన్నిధిలో చేసే అన్నసంతర్పణ కార్యక్రమం చాలా శక్తివంతమైనదని, అలా అన్నదానం చేసిన భక్తులకు కార్యసిద్ధి జరిగి వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరుతున్నాయని తెలియజేశారు, షిరిడి నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులు మద్ది రమేష్ ఈరోజు షిరిడి నుంచి సాయి వస్త్రములను దత్త సాయి సన్నిధికి సమర్పించారని, షిరిడి నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మద్ది రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు