సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 17. 04. 2026
ఇప్పేపల్లి గ్రామానికి చెందిన ఆణిగుంట నాగిశెట్టి తండ్రి బసప్ప, తన ఆధ్యాత్మిక జీవనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా భక్తి మార్గంలో నిబద్ధతతో సాగుతున్న నాగిశెట్టి, దేశంలోని పవిత్రమైన 11 జ్యోతిర్లింగాలను పూర్తి చేసి విశేష కీర్తి పొందారు. ఆయన భక్తి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక సాధనతో గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, ధర్మం మరియు సంస్కృతిని కాపాడే దిశగా కృషి చేస్తున్న నాగిశెట్టి, యువతకు స్ఫూర్తిగా మారారు. ఆయన సాధించిన ఈ మహోన్నత కార్యం పట్ల గ్రామస్థులు గర్వంగా భావిస్తూ, ఆయనను అభినందిస్తున్నారు.



