Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 17-04-26

నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) వద్ద నెలకొన్న చీకటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి ప్రత్యేక చొరవతో, రైల్వే అధికా రులు స్పందించి అండర్ బ్రిడ్జిలో నూతన విద్యుత్ దీపాలను (లైట్స్ )ఏర్పాటు చేశారు.​దీని పై నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు మరియు స్థానిక ప్రజా ప్రతి నిధులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఈ సందర్భంగా పలు వురు నాయకులు మాట్లా డుతూ మురళికృషినికొనియాడారు.ప్రజాప్రతినిధుల,స్పందన హ్యూమన్ రైట్స్ ప్రొటె క్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డేవిడ్ కళ్యాణి రాజు,పఠాన్ మెహర్ ఖాన్, మరియు మాడపూరి శ్రీరాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందలూరు రైల్వే సమ స్యల పరిష్కారానికి, రాచూరి మురళి నిరంతరం శ్రమిస్తున్నారు.గత కొంత కాలంగా ఆర్.యు.బి లో విద్యుత్ దీపాలు లేక ప్రయాణికులు, వాహన దారులు పడుతున్న ఇబ్బందులను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. రైల్వే అభివృద్ధి కోసం ఆయన పడుతున్నతపన,అభినంద నీయం.​మురళికిధన్యవాదా లు రైల్వే అండర్ బ్రిడ్జిలో లైట్లు అమర్చడంతో రాక పోకలు సులభతరం అయ్యాయని నాగిరెడ్డిపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, మురళికి మరియు సహకరించిన అధికారు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.