Listen to this article

జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్ర బిజెపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.ఖబర్దార్ తేజస్వి సూర్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడితే బిజెపిపై తెలంగాణ సమాజం తిరగబడుతుంది. బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ సందర్బంగా కురువ పల్లయ్య మాట్లాడుతూ. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చినా తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గు చేటు.ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన తీరును… తెలంగాణ సమాజం గమనిస్తున్నది.
తెలంగాణపై వ్యతిరేకత బీజేపీకి నరనరాల్లో నిండి ఉన్నది.పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని అని అన్నారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు.బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు.