జనంన్యూస్. 17.సిరికొండ,శ్రీనివాస్ పటేల్.
రాష్ట్ర ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేసి హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని, డీఏ, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


