

జనం న్యూస్ ఫిబ్రవరి 14; జమ్మికుంట కుమార్ యాదవ్.ముస్లింల పవిత్ర మాసమైన షాబాన్ సందర్భంగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్ మరియు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలీ రహమతుల్లాహ్ అలై దర్గాలో గురువారం రాత్రి భక్తి పారవశ్యంతో ముస్లిం సోదరులు షబేబరాత్ వేడుకలు జరుపుకున్నారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవులందరి భవిష్యత్తుకు షబ్ ఎ-బరాత్ రాత్రి మార్గనిర్దేశనం చేస్తాడని ముస్లింల విశ్వాసం, ఈరోజు అల్లాహ్ తన భక్తుల ‘రిజక్ (జీవనోపాధి)ని తదుపరి సంవత్సరానికి నిర్ణయిస్తాడు. రాబోయే ఏడాదికి ఎవరు ఏమి సాధిస్తారు? ఎవరికి ఎంత జీవనోపాధి లభిస్తుంది? ఇలా ప్రతి ముస్లిం యొక్క విధిరాత ఈరాత్రి నిర్ణయించబడుతుంది. అల్లాహ్ అందరి పాపాలు క్షమించడమే కాకుండా, ఏడాది పొడవునా చేయవలసిన కార్యాలను కూడా తన సేవకులలో ప్రతి ఒక్కరి క చిపెడతాడు.ప్రతి వ్యక్తి ఏడాదిలో చేసిన పాప పుణ్యాల లెక్కలు కూడా ఈ రాత్రికి అల్లాహ్ ఎదుట ప్రవేశపెట్టబడుతాయి అని ప్రతి ముస్లింల విశ్వాసం. షబ్ ఎ-బరాత్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేసినారు. పవిత్ర ఖురాన్ ను పఠించినారు. మానవజాతి శ్రేయస్సు కోసం దువా చేసినారు. జామే మస్జిద్ లో మత గురువులు మౌలానా నియాజ్ రజా, మౌలానా యాసీన్,మరియు ఖాజా పాషా, అల్లాహ్ సందేశాలను, ఖురాన్ లోని సూక్తులను వివరించారు. ప్రత్యేక నమాజు చదివించినారు. అనంతరం మౌలానా యాసీన్ మాట్లాడుతూ… మహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ అయిషా ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి మొహమ్మద్ ప్రవక్త కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య (ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింది. భార్యను చూసిన ప్రవక్త (స) ‘అయిషా! నన్నే అనుమానిస్తున్నావా? అల్లాహ్ మన్నింపు, కారుణ్యం కురిసే చేయి ఇది, అందుకే ఈ సమాధుల్లో శాశ్వతంగా నిద్రిస్తున్న వారి మన్నింపు కోసం అల్లాహ్ ను వేడుకుంటున్నాను’ అని తన సతీమణికి వివరణ ఇచ్చారు ముహమ్మద్ ప్రవక్త (స).షాబాన్ నెల 15వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఇస్లామీయ చరిత్రలో నిలిచిపోయింది. రంజాన్ నెలకు 15 రోజుల ముందు జరిగిన ఈ ఘటనను “షబే బరాత్”గా జరుపుకొంటారు,అని చెప్పారు. శుక్రవారం రాత్రంతా ముస్లింలు జాగారం చేస్తూ మసీదుల్లో నమాజులు ఆచరించారు.షాబాన్ మాసంలో మృతి చెందిన తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసినారు.తమ పూర్వీకుల సమాధులను సందర్శించినారు. వారి మగ్ఫిరత్ (మన్నింపు)కోసం దువా చేసినారు. దువా అంటే వేడుకోలు షాబాన్ నెల తొలి పదిహేను రోజులు ప్రవక్త (స) ఉపవాసాలు పాటించి రమజాన్ కు సంసిద్ధులయ్యే వారు. శుభాలు సమృద్ధిగా వర్షించే షాబాన్ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకుండ రంజాన్ నెలను స్వాగతించే విధంగా ఎవరికి వారు సన్నద్ధం కావాలి. వీలైనన్ని ఎక్కువ ప్రార్ధనలు చేసి దైవ సాన్నిధ్యాన్ని పొందాలి’ అంటారు అబ్దుల్ ఖాదిర్ జిలాని రహ్మతుల్లా అలైహ్. సమాధులను సందర్శించడం వల్ల కనువిప్పు కలుగుతుందని ఉలేమాలు షబే బరాత్ సందేశాన్ని వివరించినారు. ఖబరస్తాన్ (ఖనన వాటిక)లో ప్రవేశించేటప్పుడు అస్సలాము అలైకుం ‘యా ఆహలల్ ఖుబూర్’ అని చెబుతూ లోనికి ప్రవేశించారు. ‘సమాదుల్లో నిద్రిస్తున్న మీపై శాంతి శుభాలు కురియుగాక అన్నది దాని అర్ధం. ముస్లిం సోదరులు అందరు కలిసి దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి రహమతుల్లాహ్ ఆలై సమాధులకు దర్శించుకునీ చాదర్లు సమర్పించారు. ముస్లిం సోదరులు రాత్రంతా జాగరము చేసినారు.ఈ వేడుకల్లో జమ్మికుంట మండలం మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్. అంకుషావలి ; దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్,దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం,దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్,దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయిముద్దీన్, సభ్యులు గౌసుద్దీన్;జలీల్, ఇమ్రాన్ హుస్సేన్ ,అల్తాఫ్ ఇమ్రాన్ ,తాజ్, తదితరులు పాల్గొన్నారు.