Listen to this article

జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున్ సాగర్ టౌన్-

రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సి పి ఆర్ విధానం పై అవగాహన కార్యక్రమం స్థానిక హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణమే ప్రథమ చికిత్స అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చు అని విజయపురి టౌన్ ఎస్సై ముత్తయ్య తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద వాహన చోదకులకు, స్థానిక యువతకు సిపిఆర్ చేసే విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గుండె ఆగిపోయిన సందర్భాలలో లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆసుపత్రికి తరలించే లోపు ఇచ్చే చికిత్స ఈ సి పి ఆర్ దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోకుండా చూసి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవటం సామాజిక బాధ్యత అని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడాలని ఎస్సై ముత్తయ్య పిలుపునిచ్చారు.స్థానిక కమల నెహ్రూ ఆసుపత్రి డాక్టర్ జయంత్ మాట్లాడుతూ సిపిఆర్ చేసే విధానాన్ని దశలవారీగా వివరించారు ప్రమాదానికి గురైన వ్యక్తి భుజాలు తట్టి పిలవాలి స్పందన లేకపోతే బాధితుడ్ని గట్టి నేలపై పడుకోబెట్టాలి, చేతి అరచేతిని బాధితుడు చాతి మధ్య భాగంలో ఉంచి రెండో చేతిని దానిపై లాక్ చేయాలి నిమిషానికి 100నుంచి120 సార్లు వేగంతో కనీసం రెండు అంగుళాల లోతుకు చాతిని బలంగా నొక్కాలి. అంబులెన్స్ వచ్చేవరకు అత్యవసర చికిత్స, లేదా వైద్యులు వచ్చేవరకు ఈ ప్రక్రియను ఆపకుండా కొనసాగించాలి అని తెలిపారు. గోల్డెన్ అవర్ ప్రమాదం జరిగిన మొదటి గంట ప్రాముఖ్యతను స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు, మరియు కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.