Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

4వ దశ అరైవ్ అల్ లైవ్ క్యాంపెయిన్ 5వ రోజు షెడ్యూల్‌లో భాగంగా, సీఐ రంజిత్ రావు ఆదేశాల మేరకు, ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బందితో కలిసి శాయంపేట మండలంలోని మందారిపేట సెంటర్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు ఎలా స్పందించాలి, వెంటనే 100/108 అత్యవసర సేవలకు సమాచారం ఎలా ఇవ్వాలి, బాధితులను భయపడకుండా ధైర్యం చెప్పడం, రక్తస్రావం జరిగితే తక్షణ ప్రథమ చికిత్స ఎలా అందించాలి, గాయపడిన వారిని జాగ్రత్తగా సురక్షితంగా ఆసుపత్రికి ఎలా తరలించాలి అనే అంశాలను ప్రాక్టికల్‌గా చూపించి అవగాహన కల్పించారు అదేవిధంగా ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణించి, ఆ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు అలాగే ప్రమాద బాధితులకు సహాయం చేసే మంచి మనసున్న పౌరులను ప్రోత్సహించే రాహా వీర్ స్కీమ్ గురించి, అలాగే ప్రమాద బాధితులకు అందుబాటులో ఉన్న పీఎం రాహత్ స్కీమ్ ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, యువత పాల్గొని రోడ్డు భద్రతా పై అవగాహన తెలుసుకున్నారు…..